- గ్రామంలో ప్రతి వీధిలో రోడ్డు
- శుద్ధమైన త్రాగునీటి సరఫర.
- మన మస్కాపూర్ గ్రామం నాణ్యమైన విద్యకు మారుపేరు, మనవూరి పాటశాలల్లో సౌకార్యాలు మెరుగుపరిచి రాష్ట్రలో మరిన్నీ పేరు ప్రఖ్యాతులు సాధించేందుకు కృషి చేస్తాను.
- మస్కాపూర్ గ్రామ ప్రారంభం (సామిల్ ) నుండి మంచినీటి బావి వరకు దశబ్దాలుగా నిర్మాణానికి నోచుకొని బిటి రోడ్డు నిర్మాణం చేపడుతాను.
- అసంపూర్తిగా నిలిచిపోయిన డ్రైనేజీ ల నిర్మాణాలు చేపడుతాను.
- మన గ్రామములోని అన్ని వీధులతో పాటు వూరి పొలిమేరల వరకు వీధి లైట్లను తక్షణమే ఏర్పటు చేయిస్తాను.
- స్వచ్ఛమైన గాలి, కలుష్య నివారణకోసం గ్రామంలోని అన్నీ రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించి, క్లీన్ మస్కాపూర్ మరియు గ్రీన్ మస్కాపూర్ గా తీర్చి దిద్దుతా.
- మన పాఠశాలలో చదువుకొనే విద్యార్ధుల మరియు గ్రామ ప్రజల సౌకార్యార్ధం, కుంట కట్ట రోడ్డు వెడెల్పు పనులతో పాటు, CC రోడ్డు నిర్మాణం చేపడుతాను.
- కుంట పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడంతో పాటు, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి నా శాయశక్తుల కృషి చేస్తాను.
- మన వూరి యువకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని మన గ్రామ పంచాయితీ భూముల్లో ఒక ప్రదేశాన్ని ఎన్నుకోని ఒక క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటుకు కృషి చేస్తాను.
- బతుకమ్మ నిమజ్జనాల సమయంలో మన వూరి ఆడబిడ్డలు పడుతున్న అసౌకార్యాన్నీ తొలగించుటకై కాలువ వరకు సీసీ రోడ్డు పనులు పూర్తి చేసి, వీధి లైట్లు ఏర్పాటు చేసి, కాలువ వద్ద బతుకమ్మ ఘాట్‌ను కూడా నిర్మిస్తాను
- మన మస్కాపూర్ గ్రామంలో పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల అనుభవాలను, వారి మేధోసంపత్తిని వాడుకోవటానికై వారందరిని ఒక కమిటీగా నియమించి వారిని గ్రామపరిపాలనలో, మరియు దేవాలయాల నిర్వహణలో భాగస్వాములను చేస్తాను.
- గ్రామం లో నేరాలను అరికట్టేందుకు అన్నీ కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తాను.
- గ్రామ వాసులని పీడిస్తున్న కుక్కల మరియు కోతుల బెడదను నివారించటానికి గ్రామ పెద్దలతో చర్చించి నా దగ్గర ఉన్న ప్రణాళికలను ముందుంచి ఈ సమస్యను రూపుమాపుతాను.
- మధుర నగర్ లో వీధి లైట్ లు, డ్రైనేజీ ల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం ఖచ్చితంగా పూర్తి చేసి, మనం ఈ ప్రాంతానికి పెట్టుకున్న మధుర నగర్ అనే పేరుకు సార్థకత కల్పిస్తాను.
శ్రీమతి అడిదెల సాయిశ్రీ మహిపాల్
సర్పంచ్ పదవికి – మీ ఆశీర్వాదాలతో పోటీ
మస్కాపూర్ గ్రామ, కుటుంభ సభ్యులకు, ఆడ బిడ్డలకు, తల్లులకు, సోదర సోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు.
నేను మీ అడిదెల మహిపాల్. గత 20 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూనే మన గ్రామ ప్రజల కోసం ఆసుపత్రులు, కాలేజీలు, గల్ఫ్ సంబంధిత పత్రాలు వంటి అనేక విషయాల్లో నా వంతు సహాయం చేస్తూ వచ్చాను.
ఈ సేవా భావాన్నే మరింత విస్తరించి, మన మస్కాపూర్ గ్రామాన్ని అభివృద్ధి, పారదర్శకత, పరిశుభ్రత, మరియు ఆదర్శవంతమైన గ్రామంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈసారి మీ ఆశీర్వాదాలతో నా భార్య సాయి శ్రీ ను సర్పంచ్ పదవికి పోటీ చేయిస్తున్నాను.
ఇకముందు నా ప్రతి అడుగు మస్కాపూర్ ప్రజా శ్రేయస్సు కోసమే. నా భార్యను మన గ్రామ సర్పంచ్ గా గెలిపించి అవకాశం ఇస్తే అన్ని వర్గాల అభ్యున్నతికై పాటు పడుతూ వచ్చే ఐదేళ్లలో మస్కాపూర్ గ్రామానికి ఒక స్వర్ణయుగాన్ని అందిస్తానని మాటిస్తున్నాను. మా ఆలోచనలను, సమస్యలను , మన గ్రామాభివృద్ధి పట్ల మాకున్న నిభద్దతను ఈ మానిఫెస్టో రూపంలో పొందుపరిచినాము.
మన ఓటు ఉంగరానికి
ఇప్పటికీ నేను చేసినవి చిన్న చిన్న సహాయాలే. ఇక ముందుకు మీ ఆదరణతో, మీ నమ్మకంతో, మస్కాపూర్ మున్ముందు తరం కూడా గర్వపడేలా అభివృద్ధి చెందేలా నిరంతరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
నా ప్రధాన లక్ష్యాలు
మీ సమస్యలే నా బాధ్యత – ప్రతి లక్ష్యం మస్కాపూర్ అభివృద్ధి కోసం.
- గ్రామ పంచాయితీ ఆదాయ, వ్యవసాయ విషయాలలో మిక్కిలి పారదర్శకతను పాటించి, బడ్జెట్ సమావేశాలు నిర్వహించి గ్రామ పెద్దల ముందు ఉంచుతాను.
- పంచాయతీ పనులపై పారదర్శక సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచడం.
- లంచాలు, దుర్వినియోగం, ఒత్తిడి లేకుండా స్వచ్ఛమైన పరిపాలన.
- సమస్యలకు తక్షణ స్పందన, ప్రజలే నిర్ణయాల్లో భాగస్వాములు అవ్వడం.
- గ్రామంలోని అన్ని దేవాలయాలను శుభ్రంగా, పవిత్రంగా ఉంచే బాధ్యత.
- పండుగల సమయంలో ప్రత్యేక శుభ్రత–సదుపాయాలు.
- దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధుల పారదర్శక వినియోగం.
- ఐకమత్యానికి నెలవైన మన మస్కాపూర్ గ్రామంలో అన్ని కులాల, మతాల, జాతుల పండుగలను గ్రామ పంచాయతి ఆధ్వర్యంలో నిర్వహించి, సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని పెంపొందిస్తాను.
- గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూములపై అక్రమ కబ్జాలు జరగకుండా కఠిన చర్యలు.
- మస్కాపూర్ గ్రామపంచాయితీ భూముల పరిరక్షణే నా ధ్యేయం, అందుకు ఒక ప్రత్యేకమైన కమిటీని నియమిస్తాను.
- భూములపై రికార్డులను పక్కాగా నిర్వహించడం.
- గోదావరి నది తీరంలో గల గ్రామ స్మశానవాటిక వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయిస్తాను.
- యువకులకు ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు.
- కంప్యూటర్, టెక్నికల్ కోర్సులు, ఆర్మీ–నేవీ వంటి రంగాల్లో ఉచిత శిక్షణ.
- మన గ్రామంలోని నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, నాకున్న పరిచయాలను ఉపయోగించుకొని వారికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం నిర్విరామంగా చేస్తాను.
- తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన TOMCOM ద్వార గల్ఫ్ దేశాలకు వెల్లే మన గ్రామ కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తాను.
- పత్రాలు, వీసా సంబంధిత సలహాలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు.
- దోపిడీ ఏజెంట్ల బారిన పడకుండా రక్షణ చర్యలు.
- ప్రభుత్వ టాంకం/సహకార వ్యవస్థ ద్వారా పూర్తి మార్గనిర్దేశం.
పై మానిఫెస్టోలో మేము పేర్కొన్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతానని, ప్రతి సమస్యను తీరుస్తానని, మా ఐదేళ్ల పదవీకాలాన్ని మా స్వలాభానికో, ధనార్జనకో వాడుకోనని, గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఎల్లవేళలా తోడుంటానని. నా తల్లిదంరుల సాక్షిగా, నేను పుట్టి పెరిగిన ఈ మస్కాపూర్ నేల సాక్షిగా మన ఊరి దేవతల సాక్షిగా, ఆ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకవేల ఈ అంశాల పరిష్కారానికై నేను కృషి చేయనియెడల నా జీవితంలో మరోసారి మిమ్మల్ని ఓటు అడగనని ప్రమాణం చేస్తున్నాను.
మీ విశ్వాసమే నా బలం. మీ సమస్యలే నా బాధ్యత.
మస్కాపూర్ అభివృద్ధి కోసమే నా ప్రతి అడుగు. మీ పిల్లల భవిష్యత్తు, మీ గ్రామ గౌరవం కోసం నిరంతరం పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.
అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను గెలిపించగలరని మిమ్మల్ని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.
ధన్యవాదాలు – ఆడిదెల సాయిశ్రీ మహిపాల్
గ్రామ సర్పంచ్ ఎన్నిక – మీ ఒక్క ఓటు మస్కాపూర్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
వోటింగ్ తేదీ: 11/12/2025
పోలింగ్ స్థలం: మస్కాపూర్